వైద్య రంగంలో కృత్రిమ మేధస్సు (AI) సేవలు! 1 m ago
కృత్రిమ మేధస్సు భారతీయ వైద్య సేవల్లో ఖచ్చితత్వాన్ని పెంచడం, సమయాన్ని ఆదా చేయడం వంటి ప్రయోజనాలను అందిస్తోంది. AI వినియోగం హెల్త్‌కేర్ రంగంలో కొత్త అవకాశాలను తెస్తోంది. 2016-2022 మధ్య AI హెల్త్‌కేర్ పరిశ్రమలో 22.5 శాతం సగటు వార్షిక వృద్ధి రేటు (CAGR) నమోదైంది. 2025 నాటికి ఈ రంగం 7.8 బిలియన్ US డాలర్లకు చేరుకుంటుందని అంచనా. AI సాయంతో త్వరితగతిన మరియు ఖచ్చితంగా వ్యాధి నిర్ధారణ, ట్రీట్‌మెంట్ ప్లానింగ్, డేటా విశ్లేషణ వంటి కీలక విధానాలు జరుగుతున్నాయి. ఇది వైద్య సేవలను మరింత అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తుంది.